ఆర్ట్ ఆఫ్ లివింగ్ విజయవాడ విభాగం ఆధ్వర్యంలో నిరుపేదలు, ఆర్ధికంగా వెనుకబడిన బ్రాహ్మణులు, ఇతర వర్గాల వారికి నిత్యావసరాలు పంపిణీ చేశారు. సుమారు 300 మందికి బందరురోడ్డు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నిత్యావసర సరకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, తెదేపా సీనియర్ నేత ముళ్లపూడి రేణుక, ఆర్ట్ ఆఫ్ లివింగ్ విజయవాడ విభాగం ప్రతినిధి బి.ఏ.కాంతరావు తదితరులు పాల్గొన్నారు. కొండ ప్రాంతాల్లోని సుమారు 1000 మంది నిర్వాసితులకు ఆహారం అందించామని... నున్న వేద పాఠశాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు చేశామని నిర్వాహకులు తెలిపారు.
విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఔదార్యం - విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిత్యావసరాల పంపిణీ
లాక్డౌన్ కారణంగా ఉపాధిలేని పేదలందరికి పలువురు సహాయం చేస్తున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరకులను అందించారు.

విజయవాడలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిత్యావసరాల పంపిణీ