విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రా0ష్ట్ర సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు నున్న గ్రామీణ సీఐ ప్రభాకర్ రావు తెలిపారు. ఈ ముఠా...రోడ్డు వెంట పార్క్ చేసిన వాహనాలను దొంగిలిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ కోరారు.
ద్విచక్రవాహనాల దొంగల ముఠా అరెస్ట్ - విజయవాడలో చోరి ముఠా అరెస్ట్
ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు