జాతీయ రహదారులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణలోని సైబరాబాద్ పోలీసులు షాద్నగర్ సమీపంలో అరెస్టు చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. గత నెల 28న షాద్నగర్ దష్మేష్ దాబా సమీపంలో జరిగిన దొంగతనంలో వీరు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.2.89 కోట్ల నగదు, 350 గ్రాముల బంగారం, పిస్టల్, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్ పోలీసులతో కలిసి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారని సీపీ పేర్కొన్నారు.
దొంగల ముఠా దొరికింది.. రూ.3.6కోట్లు స్వాధీనం
జాతీయ రహదారులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను తెలంగాణకు చెందిన సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.60 కోట్ల విలువైన నగదు, బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
ఘరానా దొంగలు