గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ - vijaywada indhira gandhi stadium Republicday Parade
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. పరేడ్ నిర్వహణను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈసారి పరేడ్‌లో తెలంగాణ పోలీసులు పాల్గొనబోతున్నారని చెప్పారు. ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టానికి చెందిన శకటం ఉంటుందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. పరేడ్ ప్రాంగణం వద్ద బందోబస్తు, శకటాలు ఇతర ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు.
గణతంత్ర వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ
.