ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగరపాలక సంస్థ ఎన్నికలు.. సింగిల్‌విండో విధానం అమలు - విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల తాజా వార్తలు

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణకు.. ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్ట్రాంగ్‌రూంలు, పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై అధికారులు స్పష్టతకు వచ్చారు. మార్చి 3 సాయంత్రానికి ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా వెలువడనుంది.

Arrangements for Vijayawada Municipal Corporation elections
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు ఏర్పాట్లు

By

Published : Feb 24, 2021, 8:35 PM IST

మార్చి 10న జరిగే.. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 64 డివిజన్ల పరిధిలోని 788 పోలింగ్‌ కేంద్రాల్లో.. సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టారు. వికలాంగులు, వృద్ధులు తేలిగ్గా.. ఓటింగ్‌ కేంద్రాలకు వెళ్లేలా ర్యాంపులు, ఇతర ఏర్పాట్లు పూర్తి చేశారు. 32 ప్రాంతాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఇతర ఏర్పాట్ల కోసం మరికొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సమయంలో ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌కు ఐదుగురు చొప్పున.. దాదాపు 3940 మంది సిబ్బంది అవసరమని గుర్తించారు.

దాఖలైన 801 నామినేషన్లలో.. 733 సక్రమమైనవిగా అధికారులు తేల్చారు. మార్చి 3 సాయంత్రానికి అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించడంతో ఎన్నికల బృందాలు కూడా ప్రవర్తనా నియమావళి అమలు, వ్యయపరిమితిపై కన్నేసి ఉంచాయి. ఇందుకోసం.. 18 మంది అధికారులు, వీడియో గ్రాఫర్లతో కూడిన 3 బృందాలు రంగంలోకి దిగాయి. మార్చి 3వరకూ అభ్యర్థుల వ్యయాన్ని ఆయా పార్టీల ఖర్చుగా, ఆ తర్వాతి ఖర్చును వ్యక్తిగత వ్యయంగా పరిగణిస్తారు. అభ్యర్థుల ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాల అనుమతులన్నీ ఒకచోటే ఇచ్చేలా.. సింగిల్‌విండో విధానాన్ని అమలులోకి తెచ్చారు.

ఇవీ చూడండి...

అనిశా తనిఖీలు.. రాజకీయ కోణంలో చూడటం సబబు కాదు: మంత్రి వెల్లంపల్లి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details