రేపు జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కృష్ణా జిల్లా మోపిదేవి మండల పోలింగ్ కేంద్రంలో 44 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల లోపు వారు పోలింగ్‌లో పాల్గోనున్నారు. బూత్‌లలో ఓటర్లకు తాగు నీరు, విద్యుత్, పోలీస్ బందోబస్తు సహా ఇతర సౌకర్యాలు కల్పించినట్లు తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
అవనిగడ్డ నియోజకవర్గం 6 మండలాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 346 మంది పురుషులు, 194 మంది స్త్రీలు పలుచోట్ల ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
మండలం | ఓటర్లు |
అవనిగడ్డలో | 233 |
చల్లపల్లి | 124 |
నాగాయలంక | 50 |
కోడూరు | 46 |
మోపిదేవి | 44 |
ఘంటసాల | 43 |
మొత్తం ఓటర్లు | 540 |