ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పౌర్ణమి రోజున భక్తుల స్నానాలకు హంసలదీవి వద్ద ఏర్పాట్లు - సముద్ర స్నానాలకు హంసలదీవి నందు ఏర్పట్లు న్యూస్

పౌర్ణమి నాడు భక్తులు సముద్ర స్నానాలు చేసేందుకు కృష్ణా జిల్లా కోడూరు మండలం హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టారు.

arrangements-are-made-for-the-sea-baths-of-the-devotees-on-the-full-moon-day-at-hamsaladeevi-kodur-mandal-krishna-district
పౌర్ణమి నాడు భక్తుల స్నానాలకు హంసలదీవి నందు ఏర్పాట్లు

By

Published : Feb 26, 2021, 9:44 PM IST

కృష్ణా జిల్లా కోడూరు మండలం, హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ వద్ద... పౌర్ణమి నాడు భక్తుల సముద్ర స్నానాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సముద్రంలో కృష్ణానది కలిసే సాగర సంగమం వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందునా... ఆ ప్రాంతానికి భక్తులకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీనికి ప్రత్యామ్నాయంగా హంసలదీవి వద్ద అధికారులు మరమ్మతు పనులను చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్​కు ఆటంకం కలగకుండా 110 మంది పోలీసు, 40 మంది సచివాలయ మహిళ పోలీస్ సిబ్బందిని నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'సంక్షేమ రాజ్యం రావాలంటే..వైకాపా అభ్యర్థులనే గెలిపించాలి'

ABOUT THE AUTHOR

...view details