ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సౌకర్యాలు లేని ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లకు భారీ జరిమానా! - కృష్ణా జిల్లా నూజివీడు తాజా వార్తలు

కృష్ణా జిల్లా నూజివీడులోని కొవిడ్ కేర్ సెంటర్లలో ఆరోగ్యశ్రీ టీం తనిఖీలు చేసింది. ఈ సందర్భంగా పట్టణంలోని రెండు ప్రైవేట్ సెంటర్లకు భారీగా జరిమానా విధించింది.

Arogyasree team inspected private covid care centers at Nuzividu
ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లపై భారీ జరిమానాలు

By

Published : May 28, 2021, 10:04 PM IST

కృష్ణా జిల్లా నూజివీడులో ప్రైవేట్ కొవిడ్ కేర్ సెంటర్లలో తనిఖీలు చేసిన ఆరోగ్యశ్రీ టీం.. రెండు కొవిడ్ సెంటర్లకు భారీగా జరిమానా విధించింది. నూజివీడు పట్టణ పరిధిలోని ద్వారకా థియేటర్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర నర్సింగ్ హోమ్​ను ఆరోగ్యశ్రీ బృందం సభ్యులు పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయనందుకు రూ.10 లక్షలు, అమెరికన్ ఆసుపత్రిలో ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు లేవని రూ.7లక్షలు జరిమానా విధించారు.

ABOUT THE AUTHOR

...view details