ఎమ్మెల్సీలుగా పోటీ చేయనున్న పీడీఎఫ్ అభ్యర్థులకు... ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎప్) పూర్తిస్థాయిలో మద్దతు పలికింది. ఈ విషయాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయవాడలో తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీ చేస్తున్న తనకు ఏపీటిఎఫ్ మద్ధతు పలకడం సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పీడీఎఫ్ అభ్యర్థులు.. ఏపీటీఎఫ్ మద్దతు - పీడీఎఫ్ ఎమ్మెల్సీ తాజా వార్తలు
ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న తమకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మద్ధతు తెలపడం సంతోషంగా ఉందని పీడీఎఫ్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమను గెలిపించాలంటూ.. ఓటర్లను వారు అభ్యర్థించారు.
'ఏపీటిఎఫ్ మద్ధతు పలకడం సంతోషంగా ఉంది'
ఉపాధ్యాయుల, ఇతర విద్యారంగ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని నాగేశ్వరరావు చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు పోటీలో ఉన్నారని ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి షేక్ సాబ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. పీడీఎఫ్ అభ్యర్థులుగా సుపరిచితమైన తమనే గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు.