ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

APSRTC Buses Bandh Over CBN Arrest: బాబు అరెస్ట్​పై రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు బంద్.. దిక్కుతోచని స్థితిలో ప్రయాణికులు.. - ఏపీలో ఆర్టీసీ బస్సుల బంద్ న్యూస్

APSRTC Buses Bandh Over CBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా బస్సులను నిలిపివేయడంతో ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులు లేక ఎలా వెళ్లాలో తెలియక.. కొందరు ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో బస్టాండ్‌లోనే పడిగాపులు కాస్తున్నారు.

APSRTC_Buses_Bandh_Over_CBN_Arrest
APSRTC_Buses_Bandh_Over_CBN_Arrest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2023, 1:53 PM IST

APSRTC Buses Bandh Over CBN Arrest: తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు దృష్ట్యా.. రాష్ట్రంలో ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. వేకువ జామునే పలు ప్రాంతాల్లోని డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. దీంతో ఉమ్మడి కృష్ణాజిల్లాలో అన్ని బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. జగ్గయ్యపేట డిపోలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి చూశారు.

APSRTC Bus Charges Hike: ఏపీఆర్టీసీలో రాయితీల కోత.. ప్రయాణికులపై ఛార్జీల మోత..

RTC Bandh in AP: బస్సుల నిలిపివేతతో ఒకరకంగా జగ్గయ్యపేటలో అనధికారిక బందు కొనసాగుతోంది. పోలీసులు ఆదేశించడంతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. స్థానిక పోలీసుల ఆదేశాల ప్రకారమే బస్సుల రాకపోకలు కొనసాగిస్తామని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అకస్మాత్తుగా బస్సులను నిలిపివేయడంతో ఆర్టీసీ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు.

APSRTC Fares: ఇదేం దోపిడీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఆగ్రహం

APSRTC Buses Bandh: ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉదయం నుంచే ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్నిరకాల సర్వీసుల్ని రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు బస్సులు లేకపోవడంతో.. దిక్కుతోచక బస్టాండ్​లోనే ఆగిపోయారు. బాపట్ల జిల్లా కేంద్రం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీసర్వీసుల్ని అధికారులు నిలిపివేశారు.

APSRTC Employees Problems: కాగితాల్లోనే బదిలీలు, పోస్టింగులు ఎక్కడివక్కడే అంటున్న ఆర్టీసీ

RTC Bandh in AP chandrababu naidu Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేట డిపో నుంచి బస్సులు బయటకు కదల్లేదు. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ఆటోలు, ప్రైవేట్ వాహనదారులు పెద్ద మెుత్తంలో డబ్బులు వసూలు చేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో అన్ని బస్సులు బస్టాండుకే పరిమితమయ్యాయి. చంద్రబాబును అరెస్టు చేయడంతో కర్నూల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనల నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ముందుగానే బస్సులను నిలిపియారు.

APSRTC: అద్దె బస్సుల కోసం ఆర్టీసీ టెండర్లు.. ప్రకటన విడుదల

APSRTC Buses Bandh: సమాచారం లేకుండా బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు నిలిపివేతతో బస్టాండ్ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. శ్రావణ మాసం చివరి శనివారం కావడంతో ఆలయాల దర్శనానికి వెళ్తున్న భక్తులకు నంద్యాలలో ఇబ్బందులు తప్పలేదు. బస్సులు నిలిపివేయడంతో బెంగళూరు-హైదరాబాద్​కు వెళ్లే బస్సులు ఉన్నపలంగా ఆపేయడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు.

కుప్పంలో బస్సుల తగ్గింపుపై ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ..

RTC Buses Bandh: ఈ క్రమంలో వైస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఆర్టీసీ బస్​లను నిలిపి వేస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జమ్మలమడుగు డిపోలో మొత్తం 74 ఆర్టీసి బస్సులు డిపోకు పరిమితమమయ్యాయి. విశాఖలో సిటీ బస్​లు సర్వీస్ రద్దు చేశారు. సిటీ అర్బన్ బస్​లు డిపోలకు పరిమితమయ్యాయి. మద్దిలపాలెం, ద్వారక బస్ స్టాండ్, సింహాచలం డిపోల ముందు ప్రయాణికులు వేచి చూస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఆర్టీసీ డిపోలో బస్సులు నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details