విజయవాడ సింగ్‌నగర్ బుడమేరు వంతెనపై పెనుప్రమాదం తప్పింది. నూజివీడు నుండి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు బుడమేరు కాల్వ వంతెన రక్షణ గోడను వేగంగా ఢీకొట్టింది. ఇరవై అడుగుల మేర రక్షణ గోడ ధ్వంసమైంది.
గోడ ధ్వంసమైన బ్రిడ్జ్ ఇరవై అడుగుల లోతున బుడమేరు కాల్వ ఉంది. ప్రమాద సమయంలో బస్సు పొరపాటున కాలువలో పడితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం తృటిలో తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.