ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ నెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్ నిలిపివేత: ఆర్టీసీ - lockdown effect in rtc

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నిత్యం 18 గంటల కర్ఫ్యూ విధించింది. ఈ మేరకు ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు గమ్య స్థానాలకు చేరుకునే దూర ప్రాంత బస్సులను మాత్రమే నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసమే ఇలాంటి చర్యలు తీసుకున్నామని చెబుతున్న ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

apsrtc-advance-reservation-suspension
ఈ నెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్ నిలిపివేత

By

Published : May 5, 2021, 6:12 PM IST

ఈ నెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్ నిలిపివేత

కరోనా వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన కారణంగా.. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల ముందస్తు టికెట్ రిజర్వేషన్లను ఈ నెల 18 వరకు రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల లోపు గమ్య స్థానాలకు చేరుకునే దూర ప్రాంత బస్సులను మాత్రమే నడపాలని నిర్ణయించింది.

మాస్కులు ఉంటేనే అనుమతి...

తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని బస్సులను ఏపీఎస్ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. ప్రయాణికుల పరిస్ధితులను బట్టి దగ్గరి ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూతో పాటు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున... బస్టాండ్లలో నిబంధలను కఠినతరం చేసింది. మాస్కులు ఉంటేనే ప్రయాణాలకు అనుమంతించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ప్రయాణికుల భద్రత కోసమే కీలక చర్యలు తీసుకున్నామని చెబుతోన్న ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం మూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details