RTC Employees letter to cm jagan: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంతో ఒక పీఆర్సీ కోల్పోయి నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్‌ను కోరారు. 2021లో కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్.. ముఖ్యమంత్రికి రెండు పేజీల లేఖ రాసింది. ఆర్టీసీలో 2017 ఏప్రిల్‌లో జరగాల్సిన పీఆర్సీకి 2019 ఫిబ్రవరిలో 25 శాతం తాత్కాలిక ఫిట్‌మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2018లో ఎంత ఫిట్‌మెంట్ ఇస్తే ఆర్టీసీ ఉద్యోగులకు అంత ఇస్తామని అప్పట్లో ఒప్పందం జరిగిందని లేఖలో ఈయూ(ఎంప్లాయిస్ యూనియన్) తెలిపింది. ప్రభుత్వంలో విలీనం వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు 2021 ఏప్రిల్‌లో జరగాల్సిన పీఆర్సీ పెండింగ్‌లో పడిందని వివరించింది.
RTC Employees letter to cm jagan: 'ప్రభుత్వంలో విలీనం కారణంగా.. కోల్పోయిన పీఆర్సీ నష్టాన్ని భర్తీ చేయాలి' - ఏపీఆర్టీసీ వార్తలు
13:46 January 17
ముఖ్యమంత్రి జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగుల లేఖ
RTC Employees On PRC: ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఆర్టీసీ ఉద్యోగులు 2021 పీఆర్సీని నష్టపోతున్నారని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు అదనపు ఫిట్‌మెంట్ బెనిఫిట్ ఇచ్చి, స్కేల్స్ నిర్ణయించాలని లేఖలో ప్రధానంగా కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందని, తీవ్ర నిరాశకు గురవుతారని అన్నారు. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న సౌకర్యాలు ఒక్కొక్కటిగా తీసేస్తున్నారని లేఖలో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ ,గ్రాట్యుటీ, హెచ్ఆర్ఏలో సీలింగ్ అమలు సహా.. కొన్ని అలవెన్సులు రద్దు చేశారని లేఖలో ప్రస్తావించారు.
ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న వైద్య సౌకర్యాలు తొలగించి, నెలసరి ఇన్సెంటివ్‌లు నిలుపుదల చేశారని ఉద్యోగులు వెల్లడించారు. ఉద్యోగులకు దశాబ్దాలుగా ఇస్తోన్న పండుగల అడ్వాన్సులనూ ప్రభుత్వం నిలుపుదల చేసిందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. విలీనం అనంతరం ఆర్టీసీ ఉద్యోగులకు పాత పింఛన్ సౌకర్యం వస్తుందనే ఆశ నెరవేరలేదన్నారు. 2021 పీఆర్సీ నష్టపోతున్నందున చొరవ తీసుకుని న్యాయం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. 50 వేల ఆర్టీసీ ఉద్యోగులు, 40 వేల పెన్షనర్లకు న్యాయం చేయాలని.. సీఎంకు రాసిన లేఖలో ఆర్టీసీ ఈయూ ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు కోరారు.
ఇదీ చదవండి
MP RRR Letter to CID: అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేను: ఎంపీ రఘురామ