ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరుకే తెలుగు రాష్ట్రం... పరీక్షల్లో ఆంగ్లానికే ప్రాధాన్యం - riot

నిరుద్యోగులు వద్దంటున్నా... ఆంగ్ల భాషే ముద్దంటోంది ఏపీపీఎస్సీ.  గ్రూప్స్ పరీక్షల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో పరీక్షలు నిర్వహించినా ఆంగ్ల భాషే ప్రామాణికమంటోంది. అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నా ఆంగ్ల బాషకు అగ్రతాంబూలాన్నిస్తుందనే వాదన వినిపిస్తోంది.

ఏపీపీఎస్సీ ప్రధాన కార్యాలయం

By

Published : May 10, 2019, 7:20 AM IST

Updated : May 10, 2019, 11:01 AM IST

తెలుగు మాయం... ఆంగ్లానికి ప్రాధాన్యం

ఏపీపీఎస్సీ నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శరాఘాతంలా మారుతున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించే పరీక్షల్లో ఆంగ్ల భాషను ప్రామాణికంగా తీసుకోవడాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్లు ఆంగ్లంలో విద్యనభ్యసించిన వారు... పరీక్షను ఆంగ్లంలో రాస్తే ఇబ్బందేంటని ప్రశ్నిస్తోంది ఏపీపీఎస్సీ. అంతే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలకు సైతం ఆన్​లైన్ లో నిర్వహించే పరీక్షల్లో ఒక్క భాషలో మాత్రమే ప్రశ్నలు ఉంటాయని తేల్చిచెబుతోంది.

తెలుగుకు ట్రిబ్యునల్ జై
ఏఈఈ వంటి పోస్టుల భర్తీకి ఆంగ్లంలో పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ పెట్టిన సరికొత్త నిబంధనతో నిరుద్యోగ సంఘాలు, యువజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా తెలుగులో సన్నద్ధమైన అభ్యర్థులు.....సరికొత్త నిబంధన వల్ల నష్టపోతున్నామని వాపోతున్నారు. తమ గోడు ఏపీపీఎస్సీ పట్టించుకోనందున... న్యాయం చేయాలంటూ ట్రిబ్యునల్​ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఏప్రిల్ 25న అభ్యర్థులకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు తెలుగులోనూ నిర్వహించాలని ఆదేశించింది.

తప్పులు సహజమంటోన్న ఏపీపీఎస్సీ
గతంలో నిర్వహించిన పరీక్షలో ప్రశ్నలు తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లో ఉండేవి. కానీ ఏపీపీఎస్పీ కొత్త నిబంధన ద్వారా... ఆన్​లైన్​ పరీక్షలకు ఏదైనా ఒక్క భాషలోనే ప్రశ్నాపత్రం ఉంటుంది. వీటికి ఆంగ్లంలో ఇచ్చే ప్రశ్నలే ప్రామాణికం అనడం తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే అభ్యర్థులను నానా ఇబ్బందులు పెడుతోంది. తాజాగా నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి పరీక్షల్లో అనువాద దోషాలు పెద్ద సంఖ్యలో తలెత్తాయి. మడ అడవుల స్థానంలో మామిడి తోటలు అని ఇచ్చారు. ఏపీపీఎస్సీ మాత్రం ఈ తప్పులు సహజమంటోంది. ఆంగ్ల ప్రశ్ననే ప్రామాణికమంటోంది.

తెలుగులో నిర్వహించమంటున్న అభ్యర్థులు
మొత్తానికి ఆంగ్ల, తెలుగు భాషల మధ్య ఏపీపీఎస్సీ పరీక్షల్లో పెద్ద రగడే జరుగుతోంది. ఇంజనీరింగ్ సంబంధిత పరీక్షల నిర్వహణ విషయంలో ట్రిబ్యునల్ సానుకూల తీర్పు ఇచ్చినా...హైకోర్టుకు వెళ్లాలని ఏపీపీఎస్సీ చూస్తున్నందున... న్యాయస్థానమైనా తమ మొర ఆలకించాలని తెలుగు మాధ్యమంలో పరీక్ష నిర్వహించాలనుకునే అభ్యర్థులు వేడుకుంటున్నారు. రెండు భాషల్లో పరీక్ష నిర్వహించినా.. తెలుగునే ప్రామాణికంగా తీసుకోవాలన్నది అభ్యర్థుల వాదన.

Last Updated : May 10, 2019, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details