డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏపీ ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ మండలి నిర్వహించిన తనీఖీలపై.. ఆ మండలి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో చేసిన తనిఖీల్లో..అవకతవకలు వెలుగుచూశాయని జస్టిస్ ఈశ్వరయ్య తెలిపారు. ఫీజుల నియంత్రణకు రెగ్యులేటరీ కమిషన్ కసరత్తు చేస్తుందన్నారు. ఇంజినీరింగ్, వైద్య కళాశాలలకు ఫీజు నమూనా ఇస్తామని చెప్పారు. పలు కళాశాలలు నిబంధనలు పాటించట్లేదనీ.. కొన్ని కళాశాలల్లో ఉపాధ్యాయులు లేకుండా ల్యాబ్స్ నిర్వహిస్తున్నాయనీ చెప్పారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 75 శాతం హాజరు ఉంటేనే పథకాలు అందేలా చేస్తామని స్పష్టం చేశారు. కళాశాలల్లో బయోమెట్రిక్ అమలుకు చర్యలు తీసుకుంటామన్న జస్టిస్ ఈశ్వరయ్య.. మైనార్టీ కళాశాలలు మెరిట్ ప్రకారమే ప్రవేశాలు జరపాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ మండలి పర్యవేక్షణలో ప్రవేశాలు జరుగుతాయన్నారు.
'75 శాతం హాజరు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలు' - ఏపీ హెచ్ఈసీ ఛైర్మన్ ఆన్ కాలేజ్ ఫీజ్
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల్లో నిర్వహించిన తనిఖీలపై...ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ మండలి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడారు. కళాశాలలో తనిఖీల్లో పలు అవకతవకలు గుర్తించామన్నారు. కళాశాల్లో ఫీజుల నియంత్రణకు కసరత్తు చేస్తున్నామన్న ఆయన... అనంతరం ఫీజుల నమూనా కళాశాలకు అందిస్తామన్నారు. 75 శాతం హాజరు ఉంటేనే... ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని ఆయన తెలిపారు.
!['75 శాతం హాజరు ఉంటేనే ప్రభుత్వ పథకాలు అమలు' Aphec chairman eswarayya on college fee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5656459-1015-5656459-1578593403849.jpg)
జస్టిస్ ఈశ్వరయ్య