కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఆగస్టు ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి అధికారులు కృష్ణా, గోదావరి బోర్డులకు సమాచారం ఇచ్చారు. కేంద్ర జల్‌శక్తి మంత్రి ఛైర్మన్‌గా, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా గల అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కరోనా నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే అవకాశం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టులు చర్చకు రావొచ్చని భావిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇప్పటివరకు ఒకసారి మాత్రమే జరిగింది.
ఆగస్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం
కృష్ణా, గోదావరి జల వివాదాలపై ఆగస్టు ఐదో తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరపాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
apex council meeting of 5th of august