ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజల నడ్డి విరుస్తోంది' - ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజల నడ్డి విరుస్తుంది

పన్నుల వసూళ్లే లక్ష్యంగా వేసిన 3 కమిటీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల పరిధిలో పాదయాత్రలు, ఆందోళన చేపడతామన్నారు.

apcuf baburao pressmeet on taxies at Vijayawada Krishna district
ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ప్రజల నడ్డి విరుస్తుంది

By

Published : Oct 6, 2020, 3:15 PM IST

'గతంలో జుట్టుపై పన్ను వేశారని విన్నాం. ఇప్పుడు చెత్తపై పన్ను వేయడం చూస్తున్నాం' అని రాష్ట్ర పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్ బాబూరావు అన్నారు. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని... అదుకోవాల్సిన ప్రభుత్వమే వారిపై పన్నుల భారం వేస్తోందని మండిపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై రూ. 5 వేల కోట్ల భారం మోపేందుకు సిద్ధమయ్యాయని బాబూరావు ఆరోపించారు.

పన్నుల వసూళ్లే లక్ష్యంగా చట్టాలను మార్చటానికి ప్రభుత్వం మూడు కమిటీలు వేసిందని... వాటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల పరిధిలో పాదయాత్రలు, ఆందోళనలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. పన్నులు పెంచే అధికారం ప్రభుత్వానికి లేదని.. చట్ట విరుద్ధంగా చేస్తున్న చర్యలను తాము అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details