ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్‌ మోహన్‌ రెడ్డీ వేరే ఆలోచన చేయకండీ! - apcc vice president thulasi reddy press meet at vijayawada

ఇప్పుడున్న భవనాలు 80 శాతం పూర్తయ్యాయని..కాస్త వెచ్చిస్తే మిగిలిన పనులు పూర్తవుతాయని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. దీనికోసం ప్రభుత్వం వేరే ఆలోచన చేయవలసిన అవరసరం లేదని స్పష్టం చేశారు.

ఏపీసీసీ ఉపాధ్యాక్షుడు తులసిరెడ్డి మీడియా సమావేశం

By

Published : Aug 30, 2019, 10:29 AM IST

ఏపీసీసీ ఉపాధ్యాక్షుడు తులసిరెడ్డి మీడియా సమావేశం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని, ఆ మేరకు అసెంబ్లీ ఆమోదం లభించిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విజయవాడలోని మీడియా సమావేశం ద్వారా అన్నారు. 1937లో శ్రీబాగ్ ఒడంబడికలో జరిగిన ఒప్పందం మేరకు రాయలసీమలో, విశాఖలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణకు ముఖ్యమంత్రి కృషి చేయాలనీ సూచించారు. ఇప్పటికే రాజధాని అమరావతిలోని చాలావరకు భవనాలు 80 శాతం పూర్తయ్యాయని, అవి తాత్కాలికమో, శాశ్వతమో ఏమైనా కావచ్చు..కాని నిర్మాణాలు జరిగాయన్నది వాస్తవమన్నారు. ఇప్పుడు ఆ భవనాల్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూర్చుని పరిపాలన చేస్తున్నారని.. నిర్మాణాలు జరుగుతున్న భవనాలు రాజధానికి సరిపోతాయి కాబట్టి ప్రభుత్వం కాస్త వెచ్చిస్తే మిగతావి పూర్తవుతాయన్నారు. ఇటువంటి సందర్భంలో వేరే ఆలోచన అవసరం లేదని ఇప్పుడు ఉన్న చోటే రాజధానిని పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఆదాయం ఇప్పటికే మందగించిందని.. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

For All Latest Updates

TAGGED:

vijayawada

ABOUT THE AUTHOR

...view details