ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'న్యాయమూర్తి రామకృష్ణ గొంతు నొక్కేందుకే రామచంద్రపై దాడి' - జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి వార్తలు

రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. వైకాపా ప్రభుత్వ దుశ్చర్యలను న్యాయమూర్తి రామకృష్ణ ప్రశ్నించినందుకే ఆయన సోదరుడు రామచంద్రపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

APCC PRSIDENT Sailajanath
APCC PRSIDENT Sailajanath

By

Published : Sep 28, 2020, 10:47 PM IST

న్యాయమూర్తి రామకృష్ణ గొంతు నొక్కేందుకు ఆయన సోదరుడు రామచంద్రపై దాడి చేశారని ఏపీసీపీ అధ్యక్షుడు శైలజనాథ్ అన్నారు. న్యాయమూర్తి రామకృష్ణ విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వ దుశ్చర్యలను ఖండించినందుకే ఈ దాడి జరిగిందని చెప్పారు. మంత్రి వర్గీయులకు, తన కుటుంబానికి ఉన్న భూ వివాదమే తన సోదరుడిపై దాడికి కారణమని న్యాయమూర్తి రామకృష్ణ చెప్పడం అధికార పార్టీ కుట్ర అని ఆరోపించారు.

రామచంద్రపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. దాడి కేసుల్లో నిందితులను రక్షించేందుకు అధికార, పోలీసు వర్గాలు కూడా యత్నిస్తున్నాయని ఆరోపించారు. రామచంద్రపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details