ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో ఓటేసినందుకు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి... ఇప్పుడు అమలు చేయమని చెప్పడం... ముస్లింలను మోసగించడమేనని మండిపడ్డారు. రాష్ట్రంలో తెదేపా, వైకాపా, జనసేన పార్టీలు భాజాపా కరుణా కటాక్షాల కోసం తాపత్రయ పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
'ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి'
వైకాపా ప్రభుత్వం ఎన్పీఆర్, ఎన్ఆర్సీ బిల్లులకు పార్లమెంటులో అనుకూలంగా ఓటు వేసి.. ఇప్పుడు అమలు చేయడంలేదని చెప్పడంపై ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఆలోచించాలని హితవుపలికారు.
గవర్నర్ ప్రసంగంలో ప్రత్యేక హోదా గురించి కనీసం ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక హోదాపై ఎందుకు అసెంబ్లీలో తీర్మాణం చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మొండి పట్టుదల, కక్ష సాధింపు చర్యలు... ప్రజల అభిమానాన్ని ఎక్కువ కాలం పొందలేవన్నారు. వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా నాగరికంగా ఆలోచిస్తూ... ప్రజా శ్రేయస్సు కోసం ప్రత్యేక హోదాకై కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. అందుకు రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాయని శైలజానాథ్ పేర్కొన్నారు.
TAGGED:
NPR and NRC latest news