అబద్ధాలతో భాజపా ప్రభుత్వం దేశ ప్రజల ప్రాథమికహక్కులకు భంగం కలిగించేలా, భద్రతకు ముప్పు వాటిల్లేలా ప్రవర్తిస్తోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మండిపడ్డారు. ఆక్సిజన్ కొరతతో ఒక్కరు కూడా చనిపోలేదని పార్లమెంట్ వేదికగా భాజపా దేశ ప్రజలకు నిజాలు చెప్పకుండా దాచి పెడుతుందన్నారు. ఫోన్ల హ్యాకింగ్ అంశంపై కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా విజయవాడలో శైలజానాథ్ మీడియా సమావేశం నిర్వహించారు.
'పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు భాజపా అబద్ధాలను చెబుతోంది' - vijayawada latest news
పార్లమెంట్ వేదికగా దేశ ప్రజలకు భాజపా అబద్ధాలను చెబుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. పెగాసస్ అంశాన్ని పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ చేయించాలన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగించేలా, భద్రతకు ముప్పు వాటిల్లేలా భాజపా ప్రవర్తిస్తుందని శైలజానాథ్ మండిపడ్డారు.

ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
పెగాసస్ సాప్ట్వేర్ ద్వారా ప్రతిపక్షాల నాయకులు, పాత్రికేయులు, మాజీ సైనికాధికారుల ఫోన్లపై భాజపా ప్రభుత్వం నిఘా పెట్టిందని శైలజానాథ్ ఆరోపించారు. పెగాసస్ అంశాన్ని పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ చేయించాలన్నారు. దీనిపై కేంద్ర హోంమంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ గూఢాచార చర్యలను నిరసిస్తూ జులై 22వ తేదీన ఆంధ్రరత్నభవన్ నుంచి రాజ్‌భవన్ వరకు నిరసన ర్యాలీ చేపడతామన్నారు.
ఇదీ చదవండి