ఇతర రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖలు రాయటం కాదు.. కేంద్రాన్ని నిలదీయాలని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని.. తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దేశంలో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ ధరలు పెంచి విపరీతంగా దండుకుంటున్నారని ఆరోపించారు. థర్డ్ వేవ్ దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
'సీఎంలకు లేఖలు రాయటం కాదు... కేంద్రాన్ని నిలదీయండి' - shailajanath fire on cm jagan
సీఎం జగన్(cm jagan)పై ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్(sailajanath) మండిపడ్డారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని.. తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(bishwabhushan harichandan)ను కలిసి వినతి పత్రం అందజేశారు
ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్