రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు సహాయం అందించాలని సూచించారు.
వర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని... వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఆయన పేర్కొన్నారు. కరోనా, వర్షం నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కార్యకర్తలను వీడియో సందేశం ద్వారా కోరారు.