కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. కొవిడ్ 19పై ముఖ్యమంత్రి జగన్, వైకాపా నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. వైకాపా నాయకులకు ఎన్నికలే పరమావధి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశారన్నారు. ఎన్నికలు జరిగి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ఒక్కో జిల్లాకు 1000 కోట్లు కేటాయించి, వైద్యులకు సరిపడా పరికరాలు సమకుర్చాలని శైలజానాథ్ ప్రభుత్వాన్ని కోరారు. అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి కరోనా నియంత్రణకు సూచనలు తీసుకోవాలని సీఎంను కోరారు.
'కరోనా కట్టడికి జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయించాలి' - స్థానిక ఎన్నికలపై శైలజానాథ్
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. జిల్లాకు రూ.1000 కోట్లు కేటాయించాలన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నింటితో సమావేశం ఏర్పాటుచేసి సలహాలు తీసుకోవాలని సూచించారు.
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్