ప్రభుత్వం అగ్రవర్ణ పేదలపై కక్ష కట్టిందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు.అనేక పథకాలను అగ్రవర్ణ పేదలకు అందకుండా చేశారన్నారు. ఏపీ అమూల్ పాల వెల్లువలో అగ్రవర్ణ పేదలకు పాడి పశువులను ఇవ్వకుండా మరోమారు అగ్రవర్ణ పేద మహిళల పట్ల వివక్ష చూపారన్నారు. అగ్రవర్ణాలుగా పుట్టడమే వారు చేసిన తప్పా అని నిలదీశారు. ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు విద్యా,ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లు కూడా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించకపోవడం వలన నష్టపోతున్నారన్నారు.అగ్రవర్ణాల పట్ల మీరు చూపిస్తున్న వివక్ష భవిష్యత్తులో మీపై ప్రభావం చూపిస్తుందన్నారు.
'అగ్రవర్ణ పేదలపై ప్రభుత్వం కక్ష కట్టింది' - EWC Reservation News
ఏపీ అమూల్ పాల వెల్లువలో ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు పాడిపశువులు ఇవ్వలేదని ఏపీసీసీ కార్యానిర్వాహాక అధ్యక్షులు తులసిరెడ్డి విమర్శించారు. అగ్రవర్ణ మహిళలుగా పుట్టడం వారి తప్పా అని నిలదీశారు.
ఏపీసీసీ కార్యానిర్వాహాక అధ్యక్షులు తులసిరెడ్డి
ఇవీ చదవండి