ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధానిని మార్చాలనుకుంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి' - thulasireddy latest press meet news in vijayawada

రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కన్నతండ్రిలా పాలనా అందించాల్సిన ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి కసాయి తండ్రిలా పాలన అందిస్తున్నారని ఆరోపించారు.

ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రెస్​మీట్​
ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ప్రెస్​మీట్​

By

Published : Feb 27, 2020, 8:34 PM IST

మాడ్లాడుతున్న ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి

రాజధాని అమరావతిని మార్చాలనుకుంటే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్​లో ఆయన మాట్లాడుతూ రాజధాని మార్పు అనేది ఒక చారిత్రక తప్పిదమన్నారు. ఇది తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే వారిపైనే కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ వారిపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కన్నతండ్రిలా పాలన అందించాల్సిన ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి కసాయి తండ్రిలా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను పేదలకు పంచుతామని చెప్పడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అందరికి అందుబాటులో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలపై తెదేపా చర్చ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details