రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. మహిళా కమిషన్ వద్దకు వచ్చిన కేసులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై డీజీపీతో చర్చించినట్లు పద్మ మీడియాకు తెలిపారు. గుంటూరులో నగ్న వీడియోల కేసు మరవకముందే మరో కేసు నమోదైందని.. ఈ వ్యవహారంలో పోలీసుల పాత్రపై విచారించి చర్యలు తీసుకోమని డీజీపీని కోరినట్లు చెప్పారు. డీజీపీ సానుకూలంగా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారని తెలిపారు.
మహిళలపై దాడులను సహించబోం: వాసిరెడ్డి పద్మ - వాసిరెడ్డి పద్మ వార్తలు
డీజీపీ గౌతమ్ సవాంగ్‌తో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై డీజీపీతో చర్చించినట్లు ఆమె తెలిపారు.
vasireddy padma
దిశా యాప్‌ను మహిళలు అందరూ ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. మహిళా ఉద్యోగినులపై దాడులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. సైబర్ నేరాలకు పాల్పడే వారిపై మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు.
ఇదీ చదవండి
దారుణం.. ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం