కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నాడు - నేడు పనులను రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పరిశీలించారు. అనంతరం సామినేని ఉదయభాను సతీమణి సామినేని విమలాభాను ఆధ్వర్యంలో విద్యార్థినిలకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. పాఠశాల మౌలిక సదుపాయాలపై వాసిరెడ్డి పద్మ ఆరా తీశారు. తరగతి గదులను ఎప్పటికప్పుడు శానిటేషన్ చేయాలని ఆదేశించారు.
జగ్గయ్యపేటలో నాడు-నేడు పనులు పరిశీలించిన వాసిరెడ్డి పద్మ - ఏపీ టుడే న్యూస్
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పనులను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి పరిశీలించారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
vasireddy padma