పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వల్ల వచ్చే 4 గంటలపాటు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు కోరారు.