ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదాలు తగ్గటం...శుభాపరిణామం : కలెక్టర్ - KRISHNA_COLLECTOR_ON_ROAD_SAFETY

కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ క్యాంప్ కార్యాలయంలో రోడ్డు భద్రతపై సమావేశం ఏర్పాటు చేశారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గటం...శుభాపరిణామం : కలెక్టర్

By

Published : May 1, 2019, 6:52 AM IST

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది విజయవాడ నగరంతోపాటు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గడం మంచి పరిణామమని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటికి కారణాలు....ప్రమాదాల నియంత్రణకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో జాతీయ రహదారులు, పంచాయతీ రాజ్, పోలీసు, ఆర్టీసీ, సీఆర్డీఏ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, నగర పాలక సంస్థ అధికారులు పాల్గొని....ఆయా శాఖల పరిధిలో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. విజయవాడ నగరం, జిల్లాలో నుంచి వెళ్లే 65, 30 నంబర్ల జాతీయ రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తించిన అధికారులు....వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశాలను అన్వేషించారు. ప్రమాదాలను ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందని...అందుకు అన్ని శాఖల అధికారులు పనిచేయాల్సి ఉందని కలెక్టర్ సూచించారు. రద్దీ మార్గాల్లో రోడ్డు దాటే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆయా ప్రాంతాల్లో పైవంతెనలు లేదా సబ్ వేలు చేపట్టాలని పోలీసు శాఖ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చింది. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామన్నారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గటం...శుభాపరిణామం : కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details