బోడె ప్రసాద్, పెనమలూరు తెదేపా అభ్యర్థి అభివృద్ధి, సంక్షేమం 2కళ్లుగా నియోజకవర్గంలో కృషి చేశానని చెబుతున్నారు కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్. నియోజకవర్గంలోని 250 కోట్లతో 3మండలాల్లో చేసిన అభివృద్ధి, తెదేపా సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు.
కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై నివేదిక వెల్లడించారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కృషి చేశామన్న బోడె ప్రసాద్... వ్యక్తిగతంగానూ సొంత నిధులతో సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు.
పెనమలూరు సంక్షేమం
-
16,895 మంది రైతులకు రుణమాఫీ
-
అన్నదాత సుఖీభవ ద్వారా 17,166 మందికి లబ్ధి
-
పసుపు-కుంకుమ ద్వారా 94 కోట్లు సాయం
ఎన్టీఆర్ గృహకల్ప ద్వారా పూర్తైన 2700 ఇళ్లు
చాలా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం
ఇవి చదవండి
నాకు ఎవ్వరూ పోటీ కాదు: ఉప్పులేటి కల్పన