ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 45 టన్నుల ఆక్సిజన్ ను జిల్లాకు రప్పించనున్నట్లు తెలిపారు. నాలుగు వాహనాల ద్వారా మొత్తం 45 టన్నుల ఆక్సిజన్ వస్తుందన్నారు. ప్రైవేట్ , ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరానికి అనుగుణంగా అందజేస్తామని తెలిపారు . ఆసుపత్రుల నోడల్ అధికారులు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ ట్యాంకుల సరఫరాను పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు .
ఆక్సిజన్ కొరత తగ్గించేందుకు అధికారులు చర్యలు - ఏపీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత
ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు. 45 టన్నుల ఆక్సిజన్ రప్పిస్తున్నట్లు తెలిపారు.
oxygen