బాబు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోం -బుద్దా - మోహన్ బాబు
ముఖ్యమంత్రిని తిడితే పెద్దవారవుతారని మోహన్ బాబు అనుకుంటున్నారని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే చంద్రబు ముఖ్యమంత్రి కావాలని ఆయన విజయవాడలో స్పష్టం చేశారు.
అన్న గారి పేరు చెప్పుకుంటూ ఆయన పార్టీ వారసుడైన చంద్రబాబును విమర్శించడం ఏంటని, లక్ష్మీ ప్రసన్న బ్యానర్లో మీ పిల్లలతో తప్ప వేరే హీరోలతో ఎప్పుడైనా సినిమాలు తీశారా అని ప్రశ్నించారు. వయస్సు మీద పడ్డాక నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబుని విమర్శించే స్ధాయి మోహన్ బాబుది కాదని మండిపడ్డారు. అవకాశవాదిలా మోహన్ బాబు మాట్లాడుతున్నారని... చంద్రబాబు గురించి తప్పుగా మాట్లాడితే ఘాటుగా స్పందించాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు.