ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vaccination: 'టీకాల పంపిణీలో జాతీయ సగటును అధిగమించాం' - Ap Vaccinated More than the Average of Nation Says Commisoner of Health Katamaneni Bhasker in Vijayawada

కొవిడ్ వ్యాక్సినేషన్​లో దేశ సగటును మించి రాష్ట్రంలో టీకాలు వేయగలిగామని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రకటించారు. జూన్ 1 వరకు కోటి లక్షా 68 వేల 254 మొదటి, రెండో డోసుల టీకాలు రాష్ట్రంలో వేశామని వెల్లడించారు. 15 శాతం మందికి టీకాలు అందించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు.

'Health Commisoner : టీకాల పంపిణీలో జాతీయ సగటును అధిగమించాం'
'Health Commisoner : టీకాల పంపిణీలో జాతీయ సగటును అధిగమించాం'

By

Published : Jun 2, 2021, 8:52 PM IST

కొవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) ప్రక్రియలో రాష్ట్రం జాతీయ సగటును అధిగమించిందని వైద్యారోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. ఇప్పటికే 15 శాతం మందికి టీకాలు అందించిన రాష్ట్రంగా (AP) ఏపీ నిలిచిందన్నారు.

రాష్ట్ర వాటా 4.21 శాతం..

మొదటి డోసు సుమారు 76 లక్షల 28 వేల 130 మంది తీసుకోగా... వారిలో 25 లక్షల 40 వేల 124 మందికి రెండో డోసు ఇచ్చామన్నారు. రాష్ట్రాలకు కేంద్రం 23 కోట్ల డోసులు కేటాయించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కేటాయించిన టీకాల్లో రాష్ట్ర వాటా 4.21 శాతంగా ఉందని స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో అధికం..

మహారాష్ట్రలో (9.72 శాతం), ఉత్తరప్రదేశ్ (8.99 శాతం), రాజస్థాన్ (8.03 శాతం), గుజరాత్ (7.63 శాతంగా) ఇచ్చారని వివరించారు. తెలంగాణకు (2.82 శాతం), తమిళనాడు (4.06 శాతం), కర్ణాటక (5.98 శాతం), కేరళ (4.24 శాతం) టీకాలు కేటాయించిందన్నారు.

ఒక్కరోజులోనే 6 లక్షల టీకాలు వేయగలం..

రికార్డుస్థాయిలో ఒక్క రోజులోనే సుమారు 6 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఏపీకి ఉందన్నారు కాటమనేని భాస్కర్. టీకా వృథా కాకుండా వినియోగించినందుకు రాష్ట్ర వాటా కింద కేటాయించే డోసులను కేంద్రం 13 లక్షలకు పెంచినట్టు వెల్లడించారు.

ఇవీ చూడండి :Weather: రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details