ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చిన్న బడ్జెట్ స్కూళ్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోండి' - చిన్న బడ్జెట్ స్కూళ్లకు సబ్సిడీ రుణాలు

ఆంధ్రప్రదేశ్​లో ఉన్న చిన్న బడ్జెట్ స్కూళ్లను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్​మెంట్​ ఆఫ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చిన్న తరహా పరిశ్రమల్లోకి ఈ పాఠశాలలు చేర్చాలని కోరారు. వాటికి సబ్సిడీ రుణాలు ఇచ్చినట్లే చిన్న బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ap Unaided Schools
ap Unaided Schools

By

Published : May 16, 2020, 3:02 PM IST

రాష్ట్రంలో చిన్న బడ్జెట్ స్కూళ్లను చిన్న తరహా పరిశ్రమల జాబితాలోకి తీసుకొచ్చి సబ్సిడీ రుణాలు అందించాలని ఏపీ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్ మేనేజ్​మెంట్ ఆఫ్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. కరోనా పై పోరుకు ప్రభుత్వానికి మద్దతుగా సీఎం సహాయనిధికి 50 లక్షల రూపాయలను విరాళంగా అందించినట్లు తెలిపింది. రాష్ట్రంలో 14వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి తెలిపారు.

పాఠశాలలు లేకపోవడంతో ఇంట్లో ఉండే తల్లిదండ్రులు వారి పిల్లలను దగ్గరుండి చదివించాలని సూచించారు. త్వరలో పదవ తరగతి పరీక్షలు ఉన్నందున పాఠశాలలకు, విద్యార్థులకు వారధిగా ప్రభుత్వం ఆన్ లైన్ ప్లాట్​ఫాం ఏర్పాటు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:మోదీజీ.. ప్యాకేజీ ఎందుకు? డబ్బులు నేరు​గా ఇవ్వండి'

ABOUT THE AUTHOR

...view details