ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్‌ఆర్‌లు పరిశీలించాకే బిల్లులు ప్రాసెస్‌ చేయగలం - ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం - ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం వార్తలు

AP Treasury Employees Association letter to DTA: కొత్త పేస్కేళ్ల ప్రకారం బిల్లులు ప్రాసెస్‌ చేయాలంటే ఎస్‌ఆర్‌లు(సర్వీస్ రిజిస్ట్రర్స్) కావాలని ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్‌కు లేఖ రాసింది. ఇందుకోసం తగిన సమయం ఇవ్వాలని కోరింది.

AP Treasury Employees Association letter
AP Treasury Employees Association letter

By

Published : Jan 28, 2022, 10:27 AM IST

AP Treasury Employees Association letter to DTA: డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్‌కు ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం లేఖ రాసింది. కొత్త పేస్కేళ్ల ప్రకారం బిల్లులు ప్రాసెస్‌ చేయాలంటే ఎస్‌ఆర్‌లు(సర్వీస్ రిజిస్ట్రర్స్) కావాలని పేర్కొంది. ఎస్‌ఆర్‌లు పరిశీలించాకే ప్రాసెస్‌ చేయగలమని స్పష్టం చేసింది. 2, 3 రోజుల్లో బిల్లుల పరిశీలన కష్టమని లేఖలో వివరించింది. ఇందుకోసం మరికొంత సమయం పడుతుందని చెప్పింది.

బిల్లులతో పాటు ఎస్‌ఆర్‌లు అందుబాటులోకి వస్తే తప్ప ఏమీ చేయలేమని ట్రెజరీ ఉద్యోగల సంఘం తేల్చి చెప్పింది. సమయం ఇవ్వకపోతే పొరపాట్లతో ప్రజాధనం నష్టపోయే ప్రమాదం ఉందని లేఖలో అభిప్రాయపడింది. మరోవైపు ఇప్పటికే పాత పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలంటూ ఉద్యోగుల లేఖలు రాస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details