- వేటకెళ్లి.. బండరాళ్లలో తలకిందులుగా చిక్కుకొని..
MAN STUCKED IN CAVE : అడవిలో వేటకు వెళ్లి రాళ్ల మధ్య గుహలో చిక్కుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని కాపాడేందుకు అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
- వివాదాల కారణంగా.. పెందుర్తిలో భర్తను హత్యచేసిన భార్య
WIFE KILLED HUSBAND IN VISAKHA : ఆ భార్య భర్తల మధ్య కొంతకాలంగా విడాకులకు సంబంధించిన అంశం కోర్టులో నడుస్తోంది. ఆ విషయంపై తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా మళ్లీ ఇద్దరి మధ్య గొడవలు రావడంతో ఆగ్రహం చెందిన భార్య.. రాడ్‌తో భర్త తలపై కొట్టి హతమార్చింది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
- మైలవరం నియోజకవర్గంలో వర్గపోరుపై దృష్టి సారించిన సీఎం జగన్
CM Jagan focused on Mylavaram constituency: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో వర్గపోరుపై ముఖ్యమంత్రి జగన్ దృష్టి సారించారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది మంత్రి జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీకి పావులు కదుపుతున్నారు. ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్గపోరు రచ్చకెక్కగా నేడు సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
- నేను పార్టీ మారడం లేదు : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
Ganta Srinivas Rao : టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ మారతున్నడంటూ జరుగుతున్న ప్రచారంపై.. గంటా స్పందించారు. తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ నేత కన్నా లక్షీనారాయణ, గంటాతో భేటీ కావటంతో పార్టీ మారుతున్నాడంటూ ప్రచారం కొనసాగింది.
- భారత్‌కు చేరిన చివరి రఫేల్.. శత్రు దేశాలకు ఇక చుక్కలే!
36వ రఫేల్ యుద్ధ విమానం భారత్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని భారత వాయుసేన వెల్లడించింది.
- ఆడపిల్ల పుట్టిందని వేడుక ఆస్పత్రి నుంచి ఇంటివరకు రథంలో ఊరేగింపు
ఆడపిల్లల్ని పురిటిలోనే చంపేస్తున్న తరుణంలో ఈ జంట అందరికీ ఆదర్శంగా నిలించింది. ఆడపిల్ల పుట్టిందని రథంపై ఊరేగించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సాగర్, జాన్వి దంపతులు రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పసిపాపను రథంపై ఇంటికి తీసుకెళ్లారు. బ్యాండు భాజాలతో, బంధువుల కోలాహలం మధ్య ఊరేగించారు. కాగా, తాము ఎప్పుడూ ఆడపిల్లలను తక్కువ చేసి చూడలేదు అన్నారు.
- కివీస్ జట్టుకు బిగ్ షాక్.. కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు.
- పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పడిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- 'ఉగ్రదాడులు చేస్తూ.. సంబరాలా?'.. ఐరాస వేదికగా పాక్, చైనాలకు జైశంకర్ చురకలు
ఐరాస భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్, చైనాలకు పరోక్షంగా చురకలు అంటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి తీవ్రవాదులను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలనే ప్రతిపాదనలకు వీటో అధికారంతో చైనా పదేపదే అడ్డుపడడంపై అభ్యంతరం తెలిపారు.
- గవర్నమెంట్ జాబ్ వదిలేశా.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా: సోహైల్
ఇంట్రెస్టింగ్ కథలతో సినిమాలు చేస్తూ కెరీర్లో రాణిస్తున్న యంగ్ హీరో సోహైల్. బిగ్‌బాస్‌తో క్రేజ్ దక్కించుకున్న అతడు.. తాను సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకున్నాడో చెప్పాడు. ఇంకా తాను ప్రేమించిన అమ్మాయి ఎవరు? సినిమాల్లోకి ఎందుకు వచ్చాడు? వంటి విషయాలను తెలిపాడు. ఆ సంగతులు..