ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

STUDENTS CLG BALOON SATELLITE LAUNCH: NASLV 19 బెలూన్ శాట్‌‌ను ప్రయోగించిన విద్యార్థులు.. అభినందించిన శాస్త్రవేత్తలు - Usharama College Students news

Usharama College Students launched the NASLV 19 high altitude balloon: తేలప్రోలులోని ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి.. విజయాన్ని సాధించారు. 25 మంది విద్యార్థులు ఎంతో శ్రమించి బెలూన్ శాట్‌ను నింగిలోకి విడుదల చేశారు. ఈ ప్రయోగం వల్ల రైతులకు ఎంతో ఉపయోగం ఉందని శాస్త్రవేత్తలు తెలియజేశారు. మరి ఏమిటి ఆ ప్రయోగం..?, దాని పేరు ఏమిటి..?, ఆ ప్రయోగం వల్ల ఉపయోగాలు ఏమిటి..? అనే వివరాలను కళాశాల యాజమాన్యం వెల్లడించింది.

CLG BALOON
CLG BALOON

By

Published : Jun 26, 2023, 1:47 PM IST

Updated : Jun 26, 2023, 3:17 PM IST

Usharama College Students launched the NASLV 19 high altitude balloon: 'సాధించాలనే తపన, ఆసక్తి, కృషికి.. 'పట్టుదల' తోడైతే విజయం కచ్చితంగా మన సొంతం అవుతుంది.' అనే మాటను ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు రుజువు చేసి చూపించారు. 25 మంది విద్యార్థులు సంకల్ప బలంతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. వాటన్నింటినీ అధిగమించి.. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అంతేకాదు, ఆ విజయాన్ని సాధించిన మొదటి కళాశాలగా రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని.. అందరీ చేత శభాష్ అనిపించుకున్నారు. మరి ఏమిటి ఆ ప్రయోగం..?, దాని పేరు ఏంటి..?, ఆ ప్రయోగం వల్ల ఉపయోగాలు ఏంటి..? అనే వివరాలను తెలుసుకుందామా..

NASLV 19 బెలూన్ శాట్‌‌ను ప్రయోగించిన విద్యార్థులు.. అభినందించిన శాస్త్రవేత్తలు

NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్‌ ప్రయోగం విజయవంతం.. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులోని ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.. ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్‌ను తయారీ చేసి నింగిలోకి విడుదల చేశారు. ఈ ప్రయోగానికి చెన్నైకు చెందిన స్పేస్ కీప్స్ ఇండియా సహకారం అందించింది. దీంతో కళాశాలలోని అన్ని విభాగాలకు చెందిన విద్యార్ధులు.. ఓ బృందంగా ఏర్పాడి శాటి లైట్‌ను రూపొందించారు. ఈ బెలూన్ శాట్ వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్ధులు తెలియజేశారు.

బెలూన్ శాట్‌ ప్రయోగంపై డీఆర్డీవో శాస్త్రవేత్త ప్రశంసలు.. NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్‌ ప్రయోగం విజయవంతం అవ్వడంతో ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సృజనాత్మకత చూస్తే.. తనకు ఎంతో సంతోషంగా ఉందని.. డీఆర్డీవో (DRDO) శాస్త్రవేత్త డాక్టర్ పి. అనిల్ కుమార్ అన్నారు. హీలియం గ్యాస్ నింపిన బెలూన్ సుమారు మూడు గంటల పాటు నింగిలో ఉండేలా విద్యార్థులు రుపొందించారని.. ఆ ఈ బెలూన్ శాట్ సుమారు 25 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇటువంటి పరికరాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. అనంతరం ఇలాంటి గొప్ప ప్రయత్నం చేసి, ఫలితం సాధించిన కళాశాల విద్యార్థులను అభినందించారు.

ఈ ప్రయోగం కోసం విద్యార్థులు ఓ యుద్దమే చేశారు.. ఆంధ్రప్రదేశ్ పైబర్ నెట్ చైర్మన్ పి. గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.. NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్ కోసం పెద్ద యజ్ఞమే చేశారన్నారు. విద్యార్థులు చేపట్టిన ఈ ప్రాజెక్టు..ఇంతటి విజయాన్ని సాధించిందంటే దానికి కళాశాల యాజమాన్య ప్రొత్సామమే ప్రధాన కారణమన్నారు. బెలున్ శాట్‌ను రుపొందించిన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థులు సాంకేతిర రంగాలపై కూడా దృష్టి సారించాలని ఆయన సూచించారు.

NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్ ప్రత్యేకతలు.. ''ఈ బెలూన్ శాట్ ప్రయోగానికి చెన్నైకు చెందిన స్పేస్ కిడ్స్ ఇండియా సహకారం అందించింది. సుమారు 25 కిలోమీటర్ల మేర గాల్లో తేలియాడే బెలూన్ శాటిలైట్ ఇది. ఈ బెలూన్ శాటిలైట్ ద్వారా వాతావరణంలో ఉష్ణోగ్రత, తేమ, వ్యవసాయ అనుకూల పరిస్థితులను తెలుసుకోవచ్చు. ఈ శాటిలైట్..150 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే పడుతుంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో లొకేషన్ చూడవచ్చు. ఇప్పటివరకూ మొత్తం 18 ప్రాజెక్టులను ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించారు. ఇది 19వ బెలూన్ శాటిలైట్. అమెరికాకు చెందిన సుంకర అక్షయ్ సారథ్యంలో విద్యార్థులు ఈ ప్రాజెక్టును పూర్తి చేశారు. ఏపీలోనే తొలిసారిగా గాలిలో తేలియాడే NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్ లైట్ కూడా ఇదే.''

NASLV-19 హై ఆల్టిట్యూడ్ బెలూన్ శాట్‌ ప్రయోగం కోసం కాలేజ్‌లోని అన్ని డిపార్ట్‌మెంట్స్ చెందిన విద్యార్థులం కలిసి ఓ బృందంగా ఏర్పాడి, శాటి లైట్‌ను రూపొందించాము. దాదాపు 25 మంది విద్యార్థులు రాత్రి, పగలు ఎంతో కష్టపడ్డాం. ఈ విజయంతో మేము, మా కళాశాల రాష్ట్రంలోనే మొదటిసారి బెలున్ శాట్‌ను రుపొందించి, విజయం సాధించిన కళాశాలగా మొదటి స్థానం సాధించింది. అందుకు మాకు సంతోషంగా ఉంది. వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ బెలున్ శాట్ ఎంతో ఉపయోగపడుతుంది.- ఉషారామా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు.

Last Updated : Jun 26, 2023, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details