రాజధాని కేసులో కేవియట్ వేసిన రైతులకు పిటిషన్ కాపీని పంపినట్లు సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. ప్రతివాదులకు పిటిషన్ కాపీ పంపినందున వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ.. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకు రాష్ట్రప్రభుత్వం లేఖ - andhrapradesh capital issue
సుప్రీంకోర్టుకు కేవియట్ వేసిన రాజధాని రైతులకు పిటిషన్ కాపీని పంపినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ap state govt wrote a letter to supreme court to start investigation as early as possible