ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి అసాచోమ్ అవార్డు

నైపుణ్యాభివృద్ధిలో మెరుగైన శిక్షణ, ఉత్తమ విధానాల అమలుపై... ప్రతిష్టాత్మక అసాచోమ్‌ అవార్డును ఏపీఎస్ఎస్​డీసీ అందుకుంది. నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వచ్చే శాసనసభ సమావేశాలలోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సంస్థ చైర్మన్ చల్లా మధుసూధన్​రెడ్డి తెలిపారు.

ap skill devolpment corporation got assocham award
అసాచోమ్ అవార్డునందుకుంటున్న రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ చాల్లా మధుసుధనరెడ్డి

By

Published : Dec 1, 2019, 11:11 PM IST

నైపుణ్యాభివృద్ధిలో రాష్ట్రానికి అసాచోమ్ అవార్డు

నైపుణ్యాభివృద్ధిలో మెరుగైన శిక్షణ, ఉత్తమ విధానాల అమలు ద్వారా... ప్రతిష్టాత్మక అసాచోమ్‌ అవార్డును ఏపీఎస్ఎస్​డీసీ అందుకుంది. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రానున్న శాసనసభ సమావేశాలలోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దానికి సంబంధించి ఇప్పటికే సమగ్ర ప్రతిపాదనలను ఆ సంస్థ సిద్ధం చేసింది. రాజస్థాన్‌, హరియాణా, ఒడిశా, బరోడా ప్రాంతాల్లో పర్యటించి... అక్కడి వర్సిటీలను పరిశీలించింది.

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం... స్వచ్ఛంద సంస్థల్లో పూర్తి ప్రయివేటుగా నిర్వహిస్తోన్న ఇతర రాష్ట్రాల వర్సిటీల్లోని స్థితిగతులను అధ్యయనం చేసింది. అక్కడ స్వదేశీ, విదేశీ అధ్యాపకుల బోధనలు, కోర్సులు, శిక్షణ తీరుతెన్నులపై సమగ్ర నివేదికను రూపొందించింది. నిరుద్యోగ యువతను నేరుగా జాబ్‌మేళాలకు పంపించడానికి ముందే స్కిల్‌ కనెక్ట్‌ పేరిట ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేలా ఏపీఎస్ఎస్​డీసీ కార్యాచరణ అమలు చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details