AP Secretariat CPS Employees Union: స్పందన కార్యక్రమం ద్వారా జీపీఎస్ కు వ్యతిరేకంగా విజ్ఞప్తులు ఇచ్చామని ఏపీ సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత రాజేష్ తెలిపారు. జీపీఎస్ ప్రతిపాదన ను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని, గత ప్రభుత్వంలో టక్కర్ కమిటీ ప్రతిపాదన ఇది అని ఆయన వెల్లడించారు. తాము అడగని జీపీఎస్ తమకు వద్దని స్పష్టం చేశారు. ఆర్టికల్ 309 ప్రకారం పాత పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నామని, తమది ఒక న్యాయమైన డిమాండ్ అని పేర్కొన్నారు. సీపీఎస్ లో ఉద్యోగులకు అన్యాయం జరిగిందని మొన్న ఇచ్చిన ఒక నివేదిక లో ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. రాష్ట్రం లోని సీపీఎస్ ఉద్యోగులు కోరుకుంటున్నది ఓపీఎస్ మాత్రమేనని వెల్లడించారు.
AP Secretariat CPS Employees Union: జీపీఎస్‌కు వ్యతిరేకం.. సీపీఎస్ రద్దుపై జూలై 8న కలెక్టరేట్ల ఎదుట ధర్నా - పెన్షన్ పథకం
AP Secretariat CPS Employees Union: జీపీఎస్ ప్రతిపాదనను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత రాజేష్ తెలిపారు. జీపీఎస్‌కు వ్యతిరేకంగా స్పందన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇచ్చామని వెల్లడించారు. సచివాలయం సీపీఎస్ సంఘం తరపున ఐక్య ఉద్యమానికి సిద్ధం అవుతామని సీపీఎస్ ఉద్యోగుల సంఘ నేత నాపా ప్రసాద్ తెలిపారు.
ఐక్య ఉద్యమానికి సిద్ధం.. ఉద్యోగులతో చర్చించకుండా కేబినెట్లో జీపీఎస్‌ను ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘ నేత నాపా ప్రసాద్ అన్నారు. సచివాలయం సీపీఎస్ సంఘం తరపున ఐక్య ఉద్యమానికి సిద్ధం అవుతామని తెలిపారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వాలు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చాయని గుర్తు చేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సీపీఎస్‌ను వచ్చే క్యాబినెట్లో రద్దు చేస్తాం అన్నారు. నేటి ముఖ్యమంత్రి నాడు పాదయాత్రలో ప్రతిపక్షలో వుండగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విధాన పరమైన నిర్ణయం తీసుకునేది మంత్రులు గనుక వారికే విజ్ఞప్తి చేస్తున్నామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత రామకృష్ణ తెలిపారు. చాలా రాష్ట్రాలు ఓపీఎస్ అనుసరిస్తున్నాయని వెల్లడించారు. జీపీఎస్‌పై ఉద్యోగులు ఎవ్వరూ పాలాభిషేకాలు చేయలేదని, ఉద్యోగులుగా ప్రభుత్వ నిర్ణయంపై ఆవేదన చెందుతున్నామన్నారు. జేఏసీ నాయకులకు జీపీఎస్ నచ్చితే వారిని కూడా జీపీఎస్ విధానం లోకి తీసుకురావాలని, అప్పుడే తమ ఆవేదన వారికి అర్థం అవుతుందని తెలిపారు. క్యాబినెట్ చేసిన జీపీఎస్ ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.
మంత్రులకు వినతి... సీపీఎస్ రద్దు అంశంపై సచివాలయ సీపీఎస్ ఉద్యోగులు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చారు. కేబినెట్లో ఆమోదించిన జీపీఎస్‌ను వెనక్కు తీసుకోవడంతోపాటు సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ పునరుద్ధరించటమే దీనికి ప్రత్యామ్నాయమని పేర్కొంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు. సీపీఎస్ రద్దుపై ఇతర సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో ఐక్యపోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌కు అనుకూలంగాప్రకటనలు చేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకుల వ్యాఖ్యల్ని సీపీఎస్ ఉద్యోగులు ఖండించారు. సీపీఎస్ రద్దు-ఓపీఎస్ అమలు విషయంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతోనే ప్రభుత్వం చర్చించాలని డిమాండ్ చేశారు. ఇవాళ సీపీఎస్ రద్దుపై గ్రామ సచివాలయాల్లో, స్పందనలో వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. సచివాలయంలోని మంత్రుల కార్యాలయాల్లో జీపీఎస్ వెనక్కు కోవాలని, సీపీఎస్ రద్దు కోరుతూ సీపీఎస్ ఉద్యోగులు వినతిపత్రాలు ఇచ్చారు. జూలై 8 తేదీన సీపీఎస్ రద్దుపై 13 జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు ఉద్యోగులు తెలిపారు.