ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికులకు 10 లక్షలు - tiruvuru
సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వంతో ఎవరూ పోటీపడలేరని చంద్రబాబు అన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి ఆగుతుందని హెచ్చరించారు. ఏపీని తిట్టిన కేసీఆర్ తో జగన్ కలిశారన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సంక్షేమం, అభివృద్ధిలో తెదేపా ప్రభుత్వంతో ఎవరూ పోటీపడలేరని చంద్రబాబు అన్నారు. జగన్ కు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రాభివృద్ధి ఆగుతుందని హెచ్చరించారు. ఏపీని తిట్టిన కేసీఆర్ తో జగన్ కలిశారన్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏపీకి అన్యాయం జరిగిందని దేవెగౌడ జాతీయ స్థాయిలో మద్దతిచ్చారని తెలిపారు.
వచ్చే ఐదేళ్లలో ఐదుసార్లు పనుపు-కుంకుమ ఇస్తామన్నారు. ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. తనని చూసి ప్రతి ఒక్కరూ తెదేపాకు ఓటు వేయాలని కోరారు. ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
తిరువూరుకు కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడితే 10 లక్షల పరిహారం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
చంద్రబాబు భావిభారత ప్రధానిగా దేవెగౌడ సంబోధించారు. మెదీ ఏపీకిచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వల్లే అమరావతి నిర్మాణం జరుగుతోందని కొనియాడారు. నిరుద్యోగ భృతి, పింఛను 2 వేలు ఇవ్వడం చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఓటేస్తే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.