బొప్పరాజుకు ఉద్యోగుల సమస్యలు తప్ప రాజకీయాలు తెలియవని శ్రీనివాస్ అన్నారు. తహసీల్దార్ వనజాక్షిపై దాడి జరిగినప్పుడు ఆమెకు మద్దతుగా నిలబడి ఆమెకు న్యాయం చేయాలని బొప్పరాజు డిమాండ్ చేసిన విషయం గుర్తు చేశారు. దివాకర్ తమ సంఘంలోనే ఉన్నారని.. ఆయన చర్యల వల్లే తొలగించామని స్పష్టం చేశారు. ఉద్యోగుల ప్రమోషన్లు ఒక పద్ధతిలో జరుగుతాయని.. ఎన్ని ఆరోపణలు చేసినా తమలో చీలికలు తీసుకురాలేరని వ్యాఖ్యానించారు.
'బొప్పరాజు వెంకటేశ్వర్లు అడ్డదారిలో అధ్యక్షుడు అవ్వలేదు'
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు అడ్డదారిలో అధ్యక్షుడు అవ్వలేదని.. ఎన్నికల ద్వారా గెలిచారని కృష్ణా జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాస్ అన్నారు. బొప్పరాజు వెంకటేశ్వర్లుపైన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి చెందిన దివాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
'బొప్పరాజు వెంకటేశ్వర్లు అడ్డదారిలో అధ్యక్షుుడు అవ్వలేదు'