అత్యంత వేగంగా పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన పూర్తి, వాటి పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు విదేశాంగ శాఖ ఏపీ పోలీసులకు పురస్కారాన్ని ప్రకటించిందని వెల్లడించారు. ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం ఇది వరుసగా రెండోసారని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించేందుకు కృషి చేసిన సిబ్బందిని సీఎం జగన్ అభినందించారని తెలిపారు.
పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో ఏపీ పోలీస్‌శాఖకు అగ్రస్థానం - ఏపీ పోలీసు శాఖ అవార్డు వార్తలు
ఏపీ పోలీసు శాఖ మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. పాస్‌పోర్టు దరఖాస్తుల పరిశీలన పూర్తి, వాటి పరిష్కారంలో దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. విదేశాంగ శాఖ నుంచి వరుసగా రెండో సారి పురస్కారాన్ని అందుకుంది.
AP Police