తూర్పుగోదావరి జిల్లాలో.. కొవిడ్ 19 నివారణలో ఫ్రంట్ వారియర్స్‌గా ఉన్న ఎస్సై , రాజోలు ప్రభుత్వ వైద్యాధికారిని, మహిళా నర్సును అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ శునకాలుగా సంభోధించడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఓ ప్రకటనలో ఖండించింది. మాజీ ఎంపీ హర్షకుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. గతంలో బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి.. కొవిడ్ వారియర్స్ మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్‌పై ఏపీ పోలీసు అధికారుల సంఘం ఫైర్ - మాజీ ఎంపీ హర్షకుమార్ తాజా వార్తలు
మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఖండించింది. కరోనా నివారణకు వారియర్స్‌గా ఉన్న ఎస్సైను, వైధ్యాధికారులను నిందించడంపై మండిపడ్డారు.
ap Police Association