ఆప్కాస్(ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్) వద్దు, పర్మినెంట్ కావాలి అని డిమాండ్ చేస్తూ.. ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 15వ తేదీన సమ్మె నిర్వహించనున్నట్లు.. ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని... అందుకే సమ్మె చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
'ఆప్కాస్ వద్దు, పర్మినెంట్ కావాలి' - విజయవాడలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ సమావేశం
"ఆప్కాస్ వద్దు, పర్మినెంట్ కావాలి" అనే నినాదంతో ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 15వ తేదీన సమ్మె నిర్వహించనున్నట్లు.. ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు తెలిపారు.
!['ఆప్కాస్ వద్దు, పర్మినెంట్ కావాలి' AP Municipal Workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10597064-186-10597064-1613125033727.jpg)
సమ్మెకు పిలుపునిచ్చిన ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు వారి ఖాతాల్లో జమ చేయకుండా ప్రభుత్వం వాటిని ఎటు మళ్లీస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో... తాను అధికారంలోకి వస్తే "కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని".. ఇచ్చిన హమీని సీఎం జగన్ నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని.. లేదంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ..'శాసన రాజధాని అసంపూర్తి భవనాల కోసం రూ.2,154 కోట్లు అవసరం'