కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తన అధికారాలను దుర్వినియోగం చేసి భూ కబ్జాలకు పాల్పడ్డారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. జీతమే ప్రధాన ఆదాయమైనపుడు ఏడాదిలోనే 204 ఎకరాలు కొనుగోలుకు డబ్బెక్కడిదని ఆయన నిలదీశారు. 1.60 కోట్ల రూపాయలు చెల్లించి స్థిరాస్తులను ఏ విధంగా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. 2019లో మంత్రి కుటుంబానికి 8 ఎకరాలు ఉండేవన్న ఆయన... 14 నెలల్లో 204 ఎకరాలు ఎలా వచ్చాయని నిలదీశారు.
ఏడాదిలోనే 204 ఎకరాలు కొనుగోలుకు డబ్బెక్కడిది?: కళా వెంకట్రావు - తెదేపా నేత కళా వెంకట్రావు తాజా వార్తలు
కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏడాదిలోనే 204 ఎకరాలు కొనుగోలుకు డబ్బెక్కడిదని ఆయన నిలదీశారు. గుమ్మనూరు జయరాం భూ దందాపై క్షేత్రస్థాయి పరిశీలన కమిటీ ఏర్పాటు చేసినట్లు కళా వెంకట్రావు వెల్లడించారు. వీరు శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు.
గుమ్మనూరు జయరాం భూ దందాపై క్షేత్రస్థాయి పరిశీలన కమిటీ ఏర్పాటు చేసినట్లు కళా వెంకట్రావు వెల్లడించారు. కమిటీ సభ్యులుగా బీటెక్ రవి, బీటీ నాయుడు, ప్రభాకర్ చౌదరి, కె.ఈరన్నను నియమించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కర్నూలు జిల్లాలో ఈ కమిటీ విస్తృతంగా పర్యటన చేయనున్నట్లు వివరించారు. వైకాపా హయాంలో రాష్ట్రాన్ని కబ్జాల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. భూ కబ్జాలు ఇంటిపేరుగా.... అసలు పేరుని అవినీతిగా మంత్రి జయరాం మార్చుకున్నారని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.