రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10వేల వేతన జీవోను తక్షణం విడుదల చేసి,బకాయిలను వెంటనే చెల్లించాలని మెప్మా ఆర్.పి ఉద్యోగులు ధర్నాకు దిగారు.విజయవాడలో ధర్నాకు దిగిన వారు,విధుల నుంచి తమను తొలగించే వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు.తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలన్నారు.మెప్మా ఆర్.పిలు చేసే పనులను వార్డు వాలంటీర్లకు,వెల్ఫేర్ అసిస్టెంట్లకు అప్పగించొద్దని కోరారు.
ప్రకటించిన రూ.10 వేల వేతన జీవో విడుదల చేయాలి - chalo vijayawada
ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా ఏపీ మెప్మా ఆర్.పి ఉద్యోగ సంఘాలు 'ఛలో విజయవాడ' పేరుతో నిరసన చేపట్టారు.
![ప్రకటించిన రూ.10 వేల వేతన జీవో విడుదల చేయాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4229642-483-4229642-1566641056061.jpg)
ap mepma workers conduscted chalo vijayawada progarm in vijayawada in krishan district