కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును సవరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జూనియర్ వైద్యులు గవర్నర్కు వినతిపత్రాన్ని సమర్పించారు. రాజ్ భవన్లో గవర్నర్ను కలిసి ఎన్ఎంసీ బిల్లులో ఐదు అంశాల్లో చట్ట సవరణలు తేవాలని కోరారు. ప్రస్తుతం లోక్ సభ ,రాజ్యసభల్లో బిల్లు ఆమోదం పొందింది. ఈ తరుణంలో రాష్ట్రపతి దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని గవర్నర్ను కోరారు. చట్టసవరణ జరిగే తాము ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేసి ఆందోళనలు చేపడతామని తెలిపారు. తమ డిమాండ్లపై హామీ ఇచ్చేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధి డా .భానుమూర్తి నాయక్ అన్నారు.
'మా వినతిని స్వీకరించండి... గవర్నర్ గారు' - ap juda requesting for taking ammendments on national medical bill
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులోని ఐదు అంశాలను వెంటనే సవరించాలని, చట్ట సవరణలు చేయాలనీ... జూనియర్ వైద్యులంతా కలసి గవర్నర్కు వినతి పత్రం అందించారు.
మా వినతిని స్వీకరించండి... చట్ట సవరణలు తీసుకురండీ !
TAGGED:
medical bill