ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP JAC Amaravati : 'ఉద్యోగులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు.. మూడో దశ ఉద్యమానికి సిద్ధం'

AP JAC Amaravati : ఏపీ అమరావతి జేఏసీ ఉద్యోగుల మూడోదశ ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెండు దఫాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని జేఏసీ చైర్మన్ బొప్పరాజు మండిపడ్డారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని సంఘాల ఆమోదంతో మూడో దశ ఉద్యమానికి సిద్ధమని తెలిపారు.

bopparaju
bopparaju

By

Published : Apr 30, 2023, 5:44 PM IST

AP JAC Amaravati : ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మూడో దశ ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఎసీ అమరావతి ప్రకటించింది. మే నెల 8వ తేదీ నుంచి జూన్ 8 వరకు నెలరోజుల పాటు జరిపే పోరాట కార్యాచరణను జేఎసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు. విజయవాడ లోని ఏపీ జేఎసీ అమరావతి కార్యాలయంలో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు కార్యాచరణపై చర్చించి ఆమోద ముద్ర వేశారు.

తొలి రోజున మెమోరాండం... నిరసన ప్రదర్శనలు జరిగినంత కాలం ఉద్యోగులందరూ నల్లబ్యాడ్జీలు ధరించాలని నిర్ణయించారు. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు, సస్పెన్షన్లు విధించడాన్ని ఎత్తివేయాలని మే 8న జిల్లా కలెక్టర్లకు స్పందనలో మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగుల సమస్యలపై మే 9 న శ్రీకాకుళంలో మొదటి ప్రాంతీయ సదస్సు జరపాలని నిర్ణయించారు. మే 12 నుంచి 19వరకు ఉద్యోగుల ఆవేదననను ఎమ్మెల్యేలు, ఎంపీలకు తెలియజేసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. మే 17న అనంతపురంలో రెండో ప్రాంతీయ సదస్సు, మే 27న ఏలూరులో మూడో ప్రాతీయ సదస్సు నిర్వహించాలని తీర్మానించారు.

పలు సంఘాల మద్దతు..మే 30న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యోగుల సామూహిక నిరాహార దీక్ష, జూన్ 8న గుంటూరులో ఉద్యోగుల నాలుగో ప్రాంతీయ సదస్సు నిర్వహించనున్నారు. మూడో దశ ఉద్యమానికి ఎపీ ఎన్జీవో లు, టీచర్ల సంఘాలు, పలు విభాగాల ఉద్యోగ, కార్మిక సంఘాలు, పూర్తి స్థాయిలో మద్దతు తెలియ జేసినట్లు జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు తెలిపారు. ఇప్పటి వరకు రెండు దశల్లో 53 రోజుల నుంచి ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని, ఆందోళనతో తమకు నష్టం లేదని ప్రభుత్వం భావిస్తోందని బొప్పరాజు అన్నారు. ఉద్యోగులను, సంఘాల నేతలను ప్రభుత్వం చులకన భావనతో చూస్తోందని మండిపడ్డారు. ఇప్పటివరకు కేవలం ఉద్యోగులు దాచుకున్నవి, ప్రభుత్వం వాడుకున్న డబ్బులనే చెల్లించారని, 1-7-2018 నుంచి పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏ లు ఎప్పుడిస్తారో ప్రభుత్వం చెప్పలేదన్నారు. ప్రభుత్వం ఉద్యోగులపై రకరకాల కుయుక్తులు పన్నవచ్చు.. సస్పెన్షన్లు చేయవచ్చు.. ఉద్యోగులంతా సంఘటితమై ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని బొప్పరాజు పిలుపునిచ్చారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాల్సిందిగా ఇప్పటికే రెండు దశల్లో ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఉద్యమాన్ని చేపట్టాం. అయినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తోంది. అందుకే రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని సంఘాల మద్దతుతో మూడో దశ ఉద్యమానికి కార్యాచరణ రూపొందించాం. -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్

bopparaju

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details